హెచ్‌సీక్యూ వాడకంపై అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

ABN , First Publish Date - 2020-06-04T23:55:19+05:30 IST

కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెస్‌సీక్యూ)పై ఇప్పటికే విస్తృతంగా

హెచ్‌సీక్యూ వాడకంపై అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

టొరొంటో: కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్  హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెస్‌సీక్యూ)పై ఇప్పటికే విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కోవిడ్-19ను ఇది అడ్డుకోగలదని కొందరు అంటుంటే.. అలాటిదేమీ లేదని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. భారత ఔషధ నియంత్రణ మండలి (ఐసీఎంఆర్) మాత్రం దీనివల్ల ఫలితాలున్నాయని తేల్చి చెప్పింది. తాజాగా కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో మాత్రం షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వైరస్ సంక్రమించిన నాలుగు రోజుల తర్వాత ఈ డ్రగ్‌ను ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది. కరోనా వైరస్, సార్స్-కోవ్2 బహిర్గతమైన తర్వాత హైడ్రాక్సీక్లోరోక్విన్ ఈ రోగ సంక్రమణను నివారించగలదా? అని ఈ అధ్యయనం పరిశీలించింది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. 

Updated Date - 2020-06-04T23:55:19+05:30 IST