హెచ్‌సీఎల్‌ డివిడెండ్‌ రూ.10

ABN , First Publish Date - 2022-07-13T06:37:52+05:30 IST

ఐటీ సర్వీసుల రంగంలోని హెచ్‌సీఎల్‌ టెక్నాలస్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖవిలువ గల ఒక్కో షేరుపై రూ.10 మధ్యంతర డివిడెండు ప్రకటించింది.

హెచ్‌సీఎల్‌ డివిడెండ్‌ రూ.10

న్యూఢిల్లీ : ఐటీ సర్వీసుల రంగంలోని హెచ్‌సీఎల్‌ టెక్నాలస్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖవిలువ గల ఒక్కో షేరుపై రూ.10 మధ్యంతర డివిడెండు ప్రకటించింది. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ 2.4 శాతం వృద్ధితో రూ.3283 కోట్ల లాభం నమోదు చేసింది. ఇదే కాలంలో ఆదాయం 17 శాతం పెరిగి రూ.23,464 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ విలువలో కంపెనీ ఆదాయం 12-14 శాతం పెరుగుతుందని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. క్లయింట్ల డిజిటల్‌ పరివర్తనకు మద్దతు ఇవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని కంపెనీ చైర్‌ పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా తెలిపారు. స్థిర కరెన్సీ విలువలో  తమ వ్యాపారాలు త్రైమాసికంగా పోల్చినట్టయితే 2.3 శాతం, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినట్టయితే 15.6 శాతం వృద్ధిని సాధించామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.విజయకుమార్‌ చెప్పారు.  

Updated Date - 2022-07-13T06:37:52+05:30 IST