2013 Maoist attack పై జ్యుడీషియల్ కమిషన్‌ దర్యాప్తు నిలిపివేసిన Chhattisgarh HC

ABN , First Publish Date - 2022-05-11T21:50:52+05:30 IST

రాయ్‌పూర్ : 2013 Maoist attack కేసులో జ్యుడీషియల్ కమిషన్ విచారణపై స్టే విధిస్తూ Chhattisgarh high court ఆదేశాలిచ్చింది.

2013 Maoist attack పై జ్యుడీషియల్ కమిషన్‌ దర్యాప్తు నిలిపివేసిన Chhattisgarh HC

రాయ్‌పూర్ : 2013 Maoist attack కేసులో జ్యుడీషియల్ కమిషన్ విచారణపై స్టే విధిస్తూ Chhattisgarh high court ఆదేశాలిచ్చింది. Bhupesh Baghel ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ పరిధిని పెంచుతూ కొత్త పదాలను జత చేసింది. అంతేకాకుండా దర్యాప్తు గడువు తేదీని కూడా పొడిగించడంతో కమిషన్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా 28 మే 2013న ఛతీస్‌గఢ్‌లో మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఝిరం వ్యాలీలో జరిగిన ఈ దాడిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా చనిపోయిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు కాలాన్ని పొడిగించడాన్ని సవాలు చేస్తూ ఛత్తీస్‌గఢ్ విధాన సభ ప్రతిపక్ష నేత, బీజేపీకి చెందిన ధరమ్‌లాల్ కౌషిక్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్ ప్రశాంత్ మిశ్రా కమిషన్ ఇదివరకే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిందని, రిపోర్ట్‌ను కూడా అందజేసిందని పేర్కొన్నారు. ఆరు నెలల వ్యవధిలో ఈ రిపోర్టును విధాన సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కొత్త చైర్‌పర్సన్, సభ్యుడితో జ్యుడీషియల్ కమిషన్ పరిధిని ప్రభుత్వం పెంచిందని తెలిపారు. దర్యాప్తు గడువును కూడా పొడగించిందని వెల్లడించారు. కాగా ఈ పిల్‌ను పరిశీలించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ఆర్‌సీఎస్ సామంత్‌లతో కూడిన ధర్మాసనం జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ జులై 4న జరుగుతుందని స్పష్టం చేసింది. 


కాగా మావోయిస్టు దాడిపై గతంలో జ్యుడీషియల్ దర్యాప్తు జరిపిన జస్టిస్ ప్రశాంత్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య బెంచ్ గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసియ ఊకీకి రిపోర్ట్‌ను అందజేసింది. అయితే ఆ తర్వాత ప్రశాంత్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. అయితే జస్టిస్ మిశ్రా సమర్పించిన నివేదిక అసంపూర్తిగా ఉందని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. దర్యాప్తు గడువు పెంచాలని కమిషన్ కూడా కోరిందని ప్రస్తావించింది. కానీ అకస్మాత్తుగా గవర్నర్‌కు సమర్పించిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగా కొత్త చైర్మన్ జస్టిస్ కే అగ్నిహోత్ర, జస్టిస్ జీ మినాజుద్దిన్ మెంబర్‌గా కొత్త జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా మే 25, 2013న మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. పరివర్తన యాత్రలో భాగంగా సుక్మా నుంచి జగల్‌పూర్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలపై దాడికి పాల్పడ్డారు. ఈ భయానక ఘటనలో నాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన పెద్ద కొడుకు దినేష్‌తోపాటు కీలకమైన నేతలు చనిపోయారు. మొత్తం 29 మంది ఈ ఘటనలో మృత్యువాతపడ్డారు. 

Read more