ఈశ్వరయ్యతో ఏపీ ప్రభుత్వం రాజీనామా చేయిస్తుందా?

ABN , First Publish Date - 2020-08-14T01:49:25+05:30 IST

ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో...

ఈశ్వరయ్యతో ఏపీ ప్రభుత్వం రాజీనామా చేయిస్తుందా?

అమరావతి: ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేసింది. ఈ వ్యవహారంపై ఈశ్వరయ్య ఎట్టకేలకు స్పందించి మీడియా ముందుకొచ్చి తడబడుతూ వివరణ ఇచ్చేసి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండానే జంప్ అయ్యారు. అయితే.. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడంతో గురువారం హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది.


ఇక ఇదే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ‘‘మాజీ జడ్జి ఈశ్వరయ్య కేసులో హైకోర్టు స్పందనేంటి?. న్యాయమూర్తులపై కుట్ర జరుగుతున్నట్లు కోర్టు నమ్ముతోందా?. భారతదేశ చరిత్రలో ఇలాంటి  ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా?. జడ్జి రామకృష్ణ  చేసిన ఆరోపణలను ప్రకంపనలు సృష్టించాయా..?. ఈశ్వరయ్యతో ప్రభుత్వం రాజీనామా చేయిస్తుందా?.’’ అనే అంశాలపై ఈ డిబేట్‌లో పాల్గొన్న మాజీ జడ్జి రామకృష్ణ, అడ్వకేట్ శ్రవణ్ కుమార్, లీగల్ నిపుణులు జీవీఆర్ శాస్త్రి మాట్లాడారు. మాజీ జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘పత్రికల్లో వచ్చిన ఓ వార్త చూసి నేను ఇంప్లీడ్ అయ్యా. ఓ రిటైర్డ్ న్యాయమూర్తి వెనుక నుంచి ఈ విధంగా నడిపిస్తున్నారు.’’ అని అన్నారు. 


Updated Date - 2020-08-14T01:49:25+05:30 IST