అమ్మాయివి కాదు.. అబ్బాయివంటూ ఉద్యోగమివ్వని పోలీస్ శాఖ.. మెడికల్ టెస్టుల్లో షాకింగ్ పరిణామం.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-14T19:48:00+05:30 IST

అమె నాలుగేళ్ల క్రితం నాసిక్ రూరల్ పోలీస్ విభాగం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలైంది..

అమ్మాయివి కాదు.. అబ్బాయివంటూ ఉద్యోగమివ్వని పోలీస్ శాఖ.. మెడికల్ టెస్టుల్లో షాకింగ్ పరిణామం.. చివరకు..

అమె నాలుగేళ్ల క్రితం నాసిక్ రూరల్ పోలీస్ విభాగం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలైంది.. ఆ సమయానికి 19 ఏళ్ల వయసులో ఉన్న ఆ యువతి మెడికల్ టెస్ట్‌‌కు వెళ్లింది.. అయితే టెస్ట్‌లో షాకింగ్ ఫలితం వచ్చింది.. ఆమెలో పురుష క్రోమోజోమ్ ఉందని తేలడంతో ఆమె ఆ ఉద్యోగానికి అనర్హురాలని పోలీస్ శాఖ తిరస్కరించింది.. దీంతో ఆ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.. తాజాగా తీర్పు వెలువరించిన హై కోర్టు ఆమె నియామకాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర పోలీసు శాఖను ఆదేశించింది. 


షెడ్యూల్డ్ కేటగిరీ నుంచి దరఖాస్తు చేసుకున్న సదరు మహిళ రాత పరీక్షలో 200 మార్కులకు 171 మార్కులు సాధించింది. ఆ తర్వాత సర్ జేజే ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో ఆమెలో పురుష క్రోమోజో‌మ్‌లు ఉన్నట్టు బయటపడింది. దీంతో ఆమెను మహిళా కానిస్టేబుల్ ఉద్యోగానికి అనర్హురాలిగా రాష్ట్ర పోలీసు శాఖ పేర్కొంది. దీంతో సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. తాను తన జీవితమంతా స్త్రీగా జీవించానని తన పిటిషన్‌లో పేర్కొంది. అందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ కోర్టుకు సమర్పించింది. 


ఆ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు ఆమె నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పోలీసు శాఖను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్.. ఆమె విద్యార్హతకు అనుగుణంగా ప్రభుత్వం ఆమెకు ఉద్యోగావకాశం కల్పిస్తుందని కోర్టుకు హామీ ఇచ్చారు.


Read more