Abn logo
Oct 25 2021 @ 00:32AM

మనస్తాపంతో హెచ్‌సీ ఆత్మహత్య

రమేశ్‌నాయుడు(ఫైల్‌)

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 24: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్తాపం చెందిన పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.  స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి....మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విఽధులు నిర్వహిస్తున్న రమేశ్‌నాయుడు(48) టౌన్‌షిప్‌ సెక్టార్‌-3లోని 120-బి కార్టర్స్‌లో నివాసముంటున్నారు. రమేశ్‌నాయుడు గత కొంత  కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌ హుక్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఐ దేవుడమ్మ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.