ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను నయం చేయడం..!

ABN , First Publish Date - 2022-07-05T18:52:44+05:30 IST

క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలికగా నయం చేయవచ్చు. అయితే క్యాన్సర్‌ను గుర్తించడంలో

ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను నయం చేయడం..!

క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలికగా నయం చేయవచ్చు. అయితే క్యాన్సర్‌ను గుర్తించడంలో రెండు అంశాలు ఎంతో కీలకం. అవి.. 1. క్యాన్సర్‌ వ్యాధి ముందస్తు లక్షణాల గురించి తెలుసుకోవడం 2. స్క్రీనింగ్‌.


1) ముందస్తు లక్షణాలు: గడ్డలు, అసాధారణ రక్తస్రావం, దీర్ఘకాలం పాటు అజీర్తి మొదలైనవి క్యాన్సర్‌ ముందస్తు లక్షణాల్లో కొన్ని. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, నోటి, పెద్ద పేగు క్యాన్సర్‌లను ఈ లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు.

2) స్క్రీనింగ్‌: ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో నిగూఢంగా ఉన్న క్యాన్సర్‌ను స్క్రీనింగ్‌తో గుర్తించవచ్చు. లక్షణాలు బయటపడని వ్యక్తుల్లో నిర్వహించే సాధారణమైన, సులభమైన పరీక్ష ఇది.


సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మూడేళ్ల నుంచి గర్భాశయ ముఖద్వారానికి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. సాధారణ పి.ఎ.పి పరీక్షా పద్ధతిలో ఏడాదికోసారి స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి. లిక్విడ్‌ బ్రెస్ట్‌ పి.ఎ.పి పరీక్ష రెండేళ్లకోసారి చేయించుకుంటే సరిపోతుంది. 30 ఏళ్లు పైబడిన వాళ్లు, మూడేళ్లకోసారి పి.ఎ.పి పరీక్ష, హెచ్‌.పి.వి డిఎన్‌ఎ పరీక్ష చేయించుకుంటే మంచిది. కానీ హెచ్‌.ఐ.వి ఉన్నవారు, అవయవ మార్పిడి, కీమోథెరపీ చేయించుకున్నవారు, మత్తుపదార్థాలకు బానిసలైనవారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఏడాదీ పైన చెప్పిన పరీక్ష చేయించుకోవాలి. పదేళ్లు నిండిన ఆడపిల్లలకు, 46 ఏళ్ల లోపు మహిళలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సీన్‌ ఇప్పించడం వల్ల 90ు ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.


వీరికి క్యాన్సర్‌ ముప్పు


  • పొగ తాగడం, పొగాకు నమలడం(జర్దా, పాన్‌ మసాలా, గుట్కా) అలవాట్లు ఉన్నవారు
  • మద్యానికి బానిసలైనవారు, కాలేయ వ్యాధులు కలిగినవారు
  • వ్యాయామం చేయనివారు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు, ఊబకాయులు 
  • పీచు పదార్థం తక్కువగా, మసాలాలు ఎక్కువగా తినేవారు


మహిళలకు క్యాన్సర్‌ పరీక్షలు తప్పనిసరి

  • 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి వైద్యుల సహాయంతో రొమ్ము పరీక్ష, మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవాలి.
  • 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు మహిళలు మూడేళ్లకోసారి వైద్యులతో రొమ్ము పరీక్ష చేయించుకోవాలి.
  • 20 ఏళ్లు నిండిన మహిళలు, కణుతులు, గడ్డల కోసం ఇంటి దగ్గరే రొమ్ములు పరీక్షించుకుంటూ ఉండాలి.


పురుషులకు సైతం...

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌: 60 ఏళ్లు నిండిన పురుషులు ప్రతి ఏడాదీ ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ రక్తపరీక్ష, డిజిటల్‌ రెక్టల్‌ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లయితే, 40 ఏళ్ల వయసు నుంచే ప్రోస్టేట్‌ స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి.


-డాక్టర్‌ సి.హెచ్‌ మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

ఒమేగా హాస్పిటల్స్‌,బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421



Updated Date - 2022-07-05T18:52:44+05:30 IST