డయాబెటిస్‌ ఉంటే..!

ABN , First Publish Date - 2022-01-20T05:23:28+05:30 IST

యాబెటిస్‌తో బాధపడే వాళ్లు చలికాలంలో భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీటితో పాటు తాజా ఆహారాన్ని తీసుకోవాలి.

డయాబెటిస్‌ ఉంటే..!

యాబెటిస్‌తో బాధపడే వాళ్లు చలికాలంలో భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీటితో పాటు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. 

డయాబెటిస్‌ ఉండే వాళ్లు బీట్‌రూట్‌ తినకూడదనేది అపోహ మాత్రమే. బీట్‌రూట్‌ తియ్యగానే ఉండొచ్చు అయితే అందులో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉంటుంది. పొటాషియం, ఐరన్‌, మాంగనీస్‌ లాంటి మినరల్స్‌ పుష్కలం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల గ్లూకోజ్‌ లెవల్స్‌ తక్కువగా ఉంటాయి. బీట్‌రూట్‌ పరోటా, బీటరూట్‌ చపాతీ, బీట్‌ రూట్‌ జ్యూస్‌ రూపంలో ఈ ఆహారాన్ని తినొచ్చు.

చిలగడ దుంప తినటం మంచిది. అయితే వాస్తవానికి తీపిగా ఉండటం వల్ల డయాబెటిస్‌ ఉండే వారికి మంచిది కాదని కొందరంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. బంగాళదుంప కంటే ఇది ఎక్కువ మేలు చేస్తుంది. చక్కెర శాతాన్ని కంట్రోల్‌ చేసే శక్తి దీనికి ఉంటుంది. కార్బొహైడ్రేట్స్‌తో పాటు అధికశాతంలో న్యూట్రిన్లు ఉంటాయి.

వంటకాల్లో ఉపయోగించే దాల్చిన చెక్క డయాబెటిస్‌తో బాధపడేవారికి మంచి చేస్తుంది. ముఖ్యంగా ఆహారం సాఫీగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. దాల్చిన చెక్కతో టీ లేదా రోటీస్‌లో ఉపయోగించొచ్చు. నీటిలో నానబెట్టి తాగొచ్చు. చక్కెర శాతంతో పాటు కొలెస్ర్టాల్‌ను అదుపులో ఉంచుతుందిది. 

డయాబెటిస్‌ ఉండేవారికి సూపర్‌ ఫుడ్‌ జామపండు. న్యూట్రిన్లు పుష్కలం ఉండే వీటిలో పొటాషియం, ఫైబర్‌, విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. సోడియం లెవెల్స్‌ తక్కువ ఉంటాయి. అందుకే డయాబెటిస్‌ ఉండే వాళ్లు అద్భుతమైన ఆహారంలా ఫీలవుతారు.

ఆవ ఆకులు, కూరగాయలతో చేసిన సూప్స్‌ డయాబెటిస్‌తో బాధపడేవాళ్లు తీసుకోవాలి. రాగులతో చేసిన సంగటి, జొన్నలతో చేసిన రొట్టెలు, సజ్జలు లాంటి తృణ ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకుంటే మరీ మంచిది. బరువు కంట్రోల్‌తో పాటు ఫుడ్‌ తిన్నట్లుంటుంది. మంచి ఆహారాన్ని సరైన సమయంలో తినటం అలవాటు చేసుకోవాలి. కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కాకరకాయ రసం, ఓట్స్‌, బార్లీ సూప్స్‌ కూడా డయాబెటిస్‌ ఉండే వారికి మంచిదే. 

Updated Date - 2022-01-20T05:23:28+05:30 IST