Apr 17 2021 @ 12:29PM

హ్యాట్సాఫ్ పూజా హెగ్డే..!

సినిమా ఇండస్ట్రీలో నూటికి తొంబై శాతం ఆరోగ్యకరమైన వాతావరణంలోనే షూటింగ్స్ జరుగుతుంటాయి. ఒక సినిమా మొదలైన రెండు రోజులు ఒకరికొకరు కాస్త కొత్తగా ఫీలవుతారు. ఆ తర్వాత మెల్లగా అందరి మధ్య మంచి రిలేషన్ డెవలప్ అయి ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మారి పోతుంటారు. సినిమా కంప్లీటయినా కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటు ఉంటారు. ఇక హీరో, హీరోయిన్ సహా మిగతా యూనిట్ సభ్యులందరకి ఎక్కువగా రాపో ఉండేది దర్శకత్వ శాఖతోనే. ముఖ్యంగా కో - డైరెక్టర్స్‌తో నటీ నటులకి మంచి మాండింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సీనియర్ కో - డైరెక్టర్స్‌ సత్యం గారితో మూడు సినిమాలు చేసింది. అయితే సత్యం గారు 16 సాయంత్రం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ పూజా హెగ్డే ..సత్యం గారితో తను వర్క్ చేసిన సినిమాలని గుర్తు చేసుకుంటూ తన సంతాపాన్ని తెలియ చేసింది. సత్యం గారి కుటుంబం ధైర్యంగా  ఉండాలని తెలిపింది. కాగా పూజా హెగ్డే నటించిన అరవింద సమేత, సాక్ష్యం, అల వైకుంఠపురములో సినిమాలకి సత్యం గారు సీనియర్ కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అయిన కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకుల దగ్గర కో కో - డైరెక్టర్స్‌ గా సత్యం గారు పనిచేశారు. అయితే కొంత మంది తనతో పని చేసిన వారిని ఇట్టే మర్చిపోతుంటారు. ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలలో కూడా సైలెంట్‌గా ఉంటారు. కానీ పూజా హెగ్డే.. సత్యం గారి మరణ వార్త తెలియగానే సోషల్ మీడియాలో స్పందించినందుకు నెటిజన్స్ అభినందిస్తున్నారు.