హైటెక్‌ హరిదాసు..

ABN , First Publish Date - 2021-01-14T06:10:56+05:30 IST

ట్రెండ్‌ ఫాలో అవ్వను.. ట్రెండ్‌ సెట్‌ చేస్తా.. అన్నది ప్రముఖ కథానాయకుడు చిత్రంలోని డైలాగ్‌.. ఆధునిక పోకడలను హరి దాసులు కూడా అలవాటు చేసుకుంటున్నారు అన్న దానికి ఈ చిత్రమే నిదర్శనం...

హైటెక్‌ హరిదాసు..
ద్విచక్ర వాహనంపై హరిదాసు నగర కీర్తన

విస్సన్నపేట : ట్రెండ్‌ ఫాలో అవ్వను.. ట్రెండ్‌ సెట్‌ చేస్తా.. అన్నది ప్రముఖ కథానాయకుడు చిత్రంలోని డైలాగ్‌.. ఆధునిక పోకడలను హరి దాసులు కూడా అలవాటు చేసుకుంటున్నారు అన్న దానికి ఈ చిత్రమే నిదర్శనం...

ఒకప్పుడు హరిదాసు అంటే చిడతలు పట్టుకొని పాటలు పాడుతూ ఇంటింటికీ తిరుగుతూ  సందడి చేసేవారు. సంస్కృతీ సంప్రదా యాలకు పెద్ద పీట వేస్తునే తమ వృత్తిని కొనసాగిస్తున్నారు కొందరు హరిదాసులు.  నడిచే పని లేకుండా ద్విచక్ర వాహనంపై తలపై ఉండాల్సిన అక్షయ పాత్రను బైక్‌పై ఏర్పాటు చేశాడు.  నోటి పాటతో పని లేకుండా టేప్‌ రికార్డు సౌండ్‌ బాక్సులను ఏర్పాటు చేసి సెల్‌ ఫోన్‌లో హరి కీర్తనలను వినిపిస్తూ ఇంటింటికీ తిరుగుతున్నాడు. తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తున్నామని హరిదాసులు చెపుకుంటూనే నయా గెటప్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. 



Updated Date - 2021-01-14T06:10:56+05:30 IST