6 నెలలుగా చొరబాట్లే లేవా..?

ABN , First Publish Date - 2020-09-17T08:11:07+05:30 IST

భారత- చైనా సరిహద్దుల వెంబడి గత ఆరునెలలుగా చొరబాట్లే లేవని కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంపై కాంగ్రెస్‌ విరుచుకుపడింది...

6 నెలలుగా చొరబాట్లే లేవా..?

  • కేంద్ర ప్రకటనపై కస్సుమన్న కాంగ్రెస్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: భారత- చైనా సరిహద్దుల వెంబడి గత ఆరునెలలుగా చొరబాట్లే లేవని కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంపై కాంగ్రెస్‌ విరుచుకుపడింది. ‘‘ఎవరూ సరిహద్దులు దాటి రాలేదని ప్రధాని అంటారు. చైనాకు చెందిన ఓ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణం కూడా తీసుకున్నారు. రక్షణ మంత్రేమో చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందన్నారు. ఇపుడు ఆరు నెలలుగా అసలు చొరబాట్లే చోటుచేసుకోలేదని హోంశాఖ సహాయమంత్రి అంటున్నారు. ఏది నిజం? మోదీ ప్రభుత్వం సైన్యం వెంట ఉందా లేకా చైనా వెంటా? ఎందుకు భయపడుతున్నారు?’’ అని రాహుల్‌గాంధీ ట్విటర్‌లో ప్రశ్నించారు. ఈ సమాధానంతో చైనాకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లయిందని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా విమర్శించారు. 

Updated Date - 2020-09-17T08:11:07+05:30 IST