అనీమియా దరి చేరిందా?

ABN , First Publish Date - 2021-12-21T05:30:00+05:30 IST

రక్తహీనతను నేరుగా కనిపెట్టడం కష్టం. ఎటువంటి తీవ్ర అనారోగ్యాన్నీ

అనీమియా దరి చేరిందా?

రక్తహీనతను నేరుగా కనిపెట్టడం కష్టం. ఎటువంటి తీవ్ర అనారోగ్యాన్నీ కలిగించని రక్తహీనత, వేర్వేరు లక్షణాల రూపంలో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి రక్తహీనతను బయల్పరిచే ఆ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి.

అలసట: ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల లోపంతో అలసట ఆవరిస్తుంది.

ఏకాగ్రత లోపం: ఐరన్‌ లోపం వల్ల న్యూరోట్రాన్స్‌మీటర్ల సామర్ధ్యం సన్నగిల్లుతుంది. దాంతో ఏకాగ్రత 

కష్టమవుతుంది.

కండరాల నొప్పులు: రక్తం తగ్గడం మూలంగా నిరంతరంగా శ్రమకు లోనయ్యే కండరాలు కోలుకోవడం కష్టమవుతుంది. దాంతో కండరాల నొప్పులు వేధిస్తాయి.

గోళ్లు పెళుసుబారడం: గోళ్లు పెళుసుబారతాయి. సొట్టలు ఏర్పడతాయి.

పాలిపోయిన చర్మం: రక్తప్రవాహం, రక్తకణాలు తగ్గడం మూలంగా చర్మం పాలిపోతుంది. 

గులాబీ/ఎరుపు మూత్రం: కొన్ని రకాల పిగ్మెంట్లను అవసరానికి మించి పేగులు శోషించుకోవడం మూలంగా మూత్రం గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులోకి మారుతుంది.

ఇన్‌ఫెక్షన్లు: తరచూ ఇన్‌ఫెక్షన్లకు లోనవుతుంటే రక్తహీనతగా భావించాలి. మరీముఖ్యంగా కొందర్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తరచూ తిరగబెడుతూ ఉండడానికి ప్రధాన కారణం రక్తహీనతే! 

శ్వాస ఇబ్బంది: రక్తంలో సరిపడా ఐరన్‌ లోపిస్తే, శరీరంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది.




ఐరన్‌ కోసం....

 చికెన్‌, లివర్‌ తరచుగా తింటూ ఉండాలి.

 బ్రొకొలి, పచ్చి బఠాణీలో ఐరన్‌ ఎక్కువ.

 తోలు తీయని బంగాళాదుంప, పాలకూరల్లోనూ ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది.

 ఎండుద్రాక్ష, గుడ్డు పచ్చసొన, డ్రైడ్‌ అప్రికాట్‌ తింటూ ఉండడం అవసరం. 


Updated Date - 2021-12-21T05:30:00+05:30 IST