మెరిసిన వికాస్‌

ABN , First Publish Date - 2022-01-22T09:11:33+05:30 IST

వికాస్‌ ఖండోలా సూపర్‌-10తో అదరగొట్టడంతో.. ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

మెరిసిన వికాస్‌

ఢిల్లీపై హరియాణా గెలుపు

బెంగళూరు: వికాస్‌ ఖండోలా సూపర్‌-10తో అదరగొట్టడంతో.. ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 36-33తో దబాంగ్‌ ఢిల్లీపై నెగ్గింది. ఖండోలా 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీ ఆల్‌రౌండర్‌ సందీప్‌ నర్వాల్‌ 9 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 40-36తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచింది. బెంగాల్‌ స్టార్‌ రైడర్‌ మణిందర్‌ 19 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేక పోయాడు. 

Updated Date - 2022-01-22T09:11:33+05:30 IST