Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 22 2021 @ 13:42PM

మంచంపై నుంచి కిందపడిందని డాక్టర్లకు చెప్పిన తల్లి.. పొట్ట ఉబ్బి పాప మృతి.. 3 నెలల తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు..!

ఇంటర్‌నెట్‌డెస్క్: బిడ్డను ఎత్తుకొని ఏడ్చుకుంటూ ఆస్పత్రికి వెళ్లింది ఆ తల్లి. ఏమైందని డాక్టర్లు అడగ్గా.. మంచంపై నుంచి కిందపడిందని చెప్పింది. మంచంపై నుంచి పడితే కడుపు ఇంతలా ఉబ్బడమేంటని వైద్యులకు అనుమానం వచ్చింది. చికిత్సను అందిస్తుండగానే ఆ చిన్నారి చనిపోయింది. కానీ పోస్టు మార్టం రిపోర్టులో ఉన్నది చదివి డాక్టర్లతో పాటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన హర్యాణాలోని యమునా నగర్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ పట్టణంలోని మండిగేట్‌కు చెందిన నికిల్ కుమార్‌, న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన పూనమ్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హర్యాణాలోని యమునానగర్ జిల్లా తేజ్లి గేట్ పట్టణంలోని జగద్రి అనే ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. పెళ్లైన ఐదేళ్లకు వారికి ఓ పాప పుట్టింది. ఆ పాప పేరు దేవిక. ఓ రోజు దేవిక కడుపు ఉబ్బిపోవడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు ఏమైందని అడగ్గా.. మంచంపై నుంచి కిందపడింది అని పూనమ్ చెప్పింది. చికిత్సను అందిస్తుండగా దేవిక చనిపోయింది. డాక్టర్లకు పూనమ్ చెప్పిన మాటలపై నమ్మకం కలగలేదు. మృతదేహన్ని పోస్టుమార్టంకు పంపించారు. పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. మూడు నెలల తర్వాత వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు చూసి వైద్యులు, పోలీసులు షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


పెళ్లైన కొద్దిరోజుల వరకు భార్యభర్తలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నికిల్ కుమార్‌కు పూనమ్‌పై అనుమానం మొదలైంది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగిపోయాయి. ఈ మధ్యలో పూనమ్ ఓ పాపకు జన్మనించింది. ముందే అనుమానంతో రగిలిపోతున్న నికిల్ కుమార్‌కు ఆ పాప తన వల్ల పుట్టింది కాదని భావించాడు. జూలై 17న పూనమ్‌తో మరోసారి గొడవపడి ఆమెను కొట్టాడు. ఈ కొట్లాటలో దేవిక కిందపడిపోయింది. కోపంతో ఉన్న నికిల్.. ఆ చిన్నారిని కూడా చావబాదాడు. అతడి దెబ్బలకు దేవికకు కడుపునొప్పి రావడం మొదలైంది. ఐదురోజులైన కడుపు నొప్పి తగ్గలేదు కదా.. రోజురోజుకీ పెరుగుతూ పోయింది. జూలై 22న దేవిక కడుపు అమాంతం పెరిగిపోయింది. దీంతో బెంబేలెత్తిపోయిన పూనమ్.. కూతురిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు చికిత్స అందిస్తున్న సమయంలో దేవిక చనిపోయింది. 


భర్త ఎంత వేధించినా.. చిన్నారి చావుకు కారణమైన పోలీసులకు మాత్రం నికిల్‌పై ఫిర్యాదు చేయలేదు. చిన్నారి చనిపోవడానికి భర్తే కారణమని తెలస్తే.. పోలీసులు పట్టుకెళ్తారని ఆమె భయం. కానీ పోస్టు మార్టం రిపోర్టు రావడంతో అసలు విషయం ఒప్పుకున్నారు. రిపోర్టులో చిన్నారి పక్కటెముకలు విరిగిపోయాయని, తలకు బలమైన గాయాలు అయ్యాయని తెలిసింది. తానే చిన్నారిని కొట్టానని నికిల్ కుమార్ ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి బుడియా గేట్ చౌకీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


బుడియా గేట్ ఔట్‌పోస్ట్ ఇంచార్జి గుర్దియల్ సింగ్ మాట్లాడుతూ నికిల్ కుమార్‌కు భార్యపై అనుమానం ఉండేదని, దీంతో వారు ప్రతిరోజూ గొడవపడేవారన్నారు. ఓరోజు పాపపై కూడా అతడు కోపం ప్రదర్శించడంతో.. ఆ చిన్నారికి గట్టిదెబ్బలే తగిలాయని, చివరికి చనిపోయిందన్నారు. భార్య అసలు విషయం దాచిపెట్టి భర్తను కాపాడాలనుకుందని, పోస్టుమార్టం రిపోర్టు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement