కార్మికులకు హర్యానా సర్కారు రూ.5వేల ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-06-18T13:42:19+05:30 IST

కరోనా లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన కార్మికులు, చిన్న వ్యాపారులు,ఆటో రిక్షా డ్రైవర్లకు ఐదువేల రూపాయల ఆర్థికసాయాన్ని...

కార్మికులకు హర్యానా సర్కారు రూ.5వేల ఆర్థికసాయం

చండీఘడ్ (హర్యానా): కరోనా లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన కార్మికులు, చిన్న వ్యాపారులు,ఆటో రిక్షా డ్రైవర్లకు ఐదువేల రూపాయల ఆర్థికసాయాన్ని హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.కరోనా వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. కరోనా వల్ల ప్రజలు నష్టపోయినందున 2021-22 మొదటి క్వార్టర్ కు ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని హర్యానా సర్కారు నిర్ణయించింది. హర్యానాలోని 12 లక్షల కుటుంబాలకు 600 కోట్ల రూపాయల ప్యాకేజీని అందజేస్తామని సీఎం చెప్పారు. ఆషా కార్యకర్తలకు ఒక్కొక్కరికి 5వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా నిరుపేదలను ఆదుకుంటామని సీఎం ఖట్టర్ వివరించారు. 

Updated Date - 2021-06-18T13:42:19+05:30 IST