రెండు వ్యాక్సిన్లు తీసుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించం: హర్యానా

ABN , First Publish Date - 2021-12-22T23:35:57+05:30 IST

చండీగఢ్: రెండు వ్యాక్సిన్లు తీసుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించబోమని హర్యానా ప్రకటించింది. పెళ్లి మండపాలు, హోటళ్లు, బ్యాంకులు, మాల్స్,

రెండు వ్యాక్సిన్లు తీసుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించం: హర్యానా

చండీగఢ్: రెండు వ్యాక్సిన్లు తీసుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించబోమని హర్యానా ప్రకటించింది. పెళ్లి మండపాలు, హోటళ్లు, బ్యాంకులు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించబోమని హర్యానా ఆరోగ్యశాఖామంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. టీకాలు తీసుకోనివారు బస్సు ప్రయాణాలు చేయడానికి కూడా వీల్లేదన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. గుజరాత్‌లో ఈ నెల 31 వరకూ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు అనుమతినీయలేదు.

Updated Date - 2021-12-22T23:35:57+05:30 IST