చండీఘడ్(హర్యానా): గుట్కా, పాన్ మసాలాల ఉత్పత్తి, అమ్మకాలపై హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి ఏడాదిపాటు హర్యానా రాష్ట్రంలో గుట్కాలు, పాన్ మసాలాల ఉత్పత్తి, అమ్మకాలను ఏడాదిపాటు నిషేధిస్తున్నట్లు హర్యానా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా సమయంలో హర్యానాలో గుట్కాలు, పాన్ మసాలాలు తిన్న ప్రజలు బహిరంగంగా ఉమ్మి వేస్తారని వీటి ఉత్పత్తి, అమ్మకాలను గత ఏడాది నిషేధించారు.
వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు పాన్ మసాలాలు, గుట్కాల ఉత్పత్తి, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు హర్యానా సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గుట్కాలు, పాన్ మసాలాల ఉత్పత్తి, అమ్మకాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్లు, జిల్లా ఎస్పీలు, ఫుడ్ ఇన్ స్పెక్టర్లను సర్కారు ఆదేశించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.