Haryana:హోంమంత్రికి అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక

ABN , First Publish Date - 2021-08-23T13:14:49+05:30 IST

హర్యానా హోం, ఆరోగ్య మంత్రి మంత్రి అనిల్ విజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....

Haryana:హోంమంత్రికి అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక

చండీగఢ్ (పంజాబ్) : హర్యానా హోం, ఆరోగ్య మంత్రి మంత్రి అనిల్ విజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో అతన్ని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో చేర్చారు.హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు వచ్చి మంత్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.భారత్ బయోటెక్ యొక్క కొవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ ట్రయల్ డోస్ తీసుకున్న తర్వాత గత డిసెంబర్ 5 న అనిల్ విజ్ కరోనావైరస్ బారిన పడ్డారు. 


హర్యానా రాష్ట్రంలో ప్రారంభమైన కోవాక్సిన్ మూడవ దశ ట్రయల్ కోసం మొదటి వాలంటీర్‌గా ఉంటానని మంత్రి ప్రతిపాదించాడు.అంతకుముందు, హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ధన్‌ఖర్ కూడా అంబాలాలోని శాస్త్రి కాలనీలోని విజ్‌ను కలిశారు.విజ్ కోసం ప్రత్యేక వైద్యుల బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందంలో పల్మనరీ,ఫార్మకోలాజికల్ వైద్యులు ఉన్నారు.అనిల్ విజ్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 


విజ్ అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు కూడా గైర్హాజరు కాలేదు, కానీ వర్షాకాల సమావేశాల్లో మొదటి రోజు అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో హాజరు కాలేదు. అయినప్పటికీ, మంత్రి అనిల్ అసెంబ్లీ సెషన్ కార్యక్రమాలను ఆక్సిజన్ పైపుతోనే టెలివిజన్‌లో చూశారు. అదే సమయంలో, మంత్రి అనిల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.


Updated Date - 2021-08-23T13:14:49+05:30 IST