ఆ కుర్రాడిని విడిపించండి ప్లీజ్.. జైశంకర్‌కు సీఎం వినతి..

ABN , First Publish Date - 2021-06-24T04:55:26+05:30 IST

ఆస్ట్రేలియాలో అకారణంగా జైలు పాలైన ఓ యువకుడిని విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర విదేశాంగ ...

ఆ కుర్రాడిని విడిపించండి ప్లీజ్.. జైశంకర్‌కు సీఎం వినతి..

ఛండీగఢ్: ఆస్ట్రేలియాలో అకారణంగా జైలు పాలైన ఓ యువకుడిని విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు హామీ ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసులో జోక్యం చేసుకోవాలంటూ ఖట్టర్ ఇవాళ జైశంకర్‌తో చర్చలు జరిపినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, భాషల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం.. సదరు యువకుడిని విశాల్ జూడేగా గుర్తించారు. అతడికి మద్దతుగా ఇప్పటికే ఆస్ట్రేలియాలో చర్చలు జరుగుతున్నాయి. ‘‘కొందరు దేశ విద్రోహులు విశాల్‌ను కొట్టారనీ.. అనంతరం ఓ తప్పుడు కేసులో అతడిని జైలుపాలు చేశారని విశాల్ స్నేహితులు చెబుతున్నారు. సిడ్నీలోని త్రివర్ణ పతాకానికి అవమానం జరగకుండా హర్యానాకి చెందిన యువకుడు విశాల్ దేశ విద్రోహ శక్తులతో గట్టిగా పోరాడాడు...’’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-06-24T04:55:26+05:30 IST