డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీక‌రించిన‌ హర్షవర్ధన్

ABN , First Publish Date - 2020-05-23T13:59:04+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీక‌రించిన‌ హర్షవర్ధన్

న్యూఢిల్లీ, మే 22 : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 34 మంది సభ్యులున్న ఈ బోర్డుకు ఆయన ఏడాది పాటు సారథ్యం వహిస్తారు. జపాన్‌కు చెందిన డాక్టర్‌ హిరోకి నకతని నుంచి బాధ్యతలు తీసుకున్న అనంతరం.. కరోనా వైరస్‌ మృతులకు హర్షవర్ధన్‌ సంతాపం ప్రకటించారు. బోర్డు కాలపరిమితి మూడేళ్లు కాగా.. రొటేషన్‌ పద్ధతిలో తొలి ఏడాది వరకు ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మిగిలిన రెండేళ్లు రీజనల్‌ గ్రూపు సభ్యులు బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాగా, హర్షవర్ధన్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం కలిశారు. కీలక బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-05-23T13:59:04+05:30 IST