Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 16 Jan 2022 13:37:35 IST

నితిన్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా హారీస్ జైరాజ్..

twitter-iconwatsapp-iconfb-icon
నితిన్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా హారీస్ జైరాజ్..

యూత్ స్టార్ నితిన్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా హారీస్ జైరాజ్ ఫిక్సైయ్యారు. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేస్తున్నాడు. సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మిస్తుండగా..దీనికి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కీలకమైన పాత్రలో హీరోయిన్ కేథరిన్ సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ సాగుతోంది. 

నితిన్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా హారీస్ జైరాజ్..

ఇక దీని తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమాను చేయనున్నాడు నితిన్. రచయితగా పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన వక్కంతం వంశీ 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా మారిన సంగతి తెలిసినే. దీని తరువాత ఆయన రూపొందిస్తున్న సినిమా ఇదే. ఇందులో నితిన్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమా కోసం హారీస్ జైరాజ్ సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. 'అపరిచితుడు', 'ఘర్షణ', 'గజిని' లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన హారీస్ జైరాజ్.. ఈ మధ్య కాస్త రేస్‌లో వెనకబడ్డాడు. మళ్ళీ నితిన్ సినిమాతో ఫాంలోకి రావాలని కసిగా ఉన్నాడట. చూడాలి మరి ఇప్పుడు థమన్, దేవీశ్రీప్రసాద్, మణిశర్మ, మహతి స్వర సాగర్, గోపీ సుందర్ లాంటి వారు వరుస ప్రాజెక్ట్స్‌తో సూపర్ ఫాంలో ఉన్నారు. వారిని ఏమాత్రం తట్టుకుంటాడో.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement