Oct 20 2021 @ 12:57PM

హరనాథ్ మనవడు హీరోగా ’సీతామనోహర శ్రీరాఘవ‘ ప్రారంభం!

అలనాటి అందాల హీరో హరనాథ్ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ లో ఆయన తిరుగులేని క్రేజ్ సంపాదించారు. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, జానపదాల్లోనూ సత్తా చాటుకున్నారు. అలాంటి నటుడి ఫ్యామిలీ నుంచి ఓ వారసుడు టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. హరనాథ్ సోదరుడు వెంకటసుబ్బరాజు మనవడే ఇతడు. ఆ హీరో పేరు విరాట్ రాజ్. సినిమా పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. ఈ సినిమా ఈ రోజే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దుర్గా శ్రీవాత్సవ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా.. ఏ.యం.రత్నం స్విచాన్ చేయగా.. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. వందన మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.