Harmanpreet Kaur: టీ20ల్లో ధోనీ రికార్డును బద్దలుగొట్టిన హర్మన్‌ప్రీత్

ABN , First Publish Date - 2022-08-01T01:58:54+05:30 IST

కామన్వెల్త్‌ (Commonwealth Games)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన

Harmanpreet Kaur: టీ20ల్లో ధోనీ రికార్డును బద్దలుగొట్టిన హర్మన్‌ప్రీత్

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్‌ (Commonwealth Games)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్ నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని 11.4 నాలుగు ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) రికార్డును అధిగమించింది. ఇండియన్ కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డును తన పేర రాసుకుంది. 


ఇప్పటి వరకు 71 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ 42 మ్యాచుల్లో జట్టును విజయపథంలో నడిపించింది. 26 మ్యాచుల్లో ఓడిపోయింది. మూడింటిలో ఫలితం తేలలేదు. 72 మ్యాచుల్లో టీమిండియాకు సారథ్యం వహించిన ధోనీ 41 మ్యాచుల్లో విజయాలు అందించాడు. 28 మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా, రెండింటిలో ఫలితం తేలలేదు.  


విరాట్ కోహ్లీ (Virat Kohli) 50 మ్యాచుల్లో భారత్‌కు సారథ్యం వహించి 30 విజయాలు అందించాడు. 16 మ్యాచుల్లో జట్టు ఓటమిపాలు కాగా, రెండు మ్యాచులు టై అయ్యాయి. రెండింటిలో ఫలితం తేలలేదు.   

Updated Date - 2022-08-01T01:58:54+05:30 IST