రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిరాహార దీక్ష

ABN , First Publish Date - 2020-09-22T18:05:47+05:30 IST

రాజ్యసభలో వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యుల ప్రవర్తన తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ లేఖ రాశారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిరాహార దీక్ష

ఢిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యుల ప్రవర్తన తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ లేఖ రాశారు. ఈ నెల 20న వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని లేఖ‌లో పేర్కొన్నారు. ఎంపీల తీరుకు నిరసనగా ఈరోజు ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్షకు దిగినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో ఆదివారం నాటి పరిణామాలతో గత రెండు రోజులుగా నిద్రకూడా పట్టడం లేదని తెలిపారు. సభ్యుల తీరుతో సభకు, సభాపతి స్థానానికి ఊహించలేని స్థాయిలో నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. అంతేగాక తాను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జన్మించిన గ్రామంలో పుట్టానని... ఆయన స్ఫూర్తితో పెరిగానని చెప్పుకొచ్చారు. 


ఇదిలా ఉంటే ... పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న ఎంపీలకు ఇవాళ ఉదయం టీ తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు డిప్యూటీ చైర్మన్. ఈ పరిణామానికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఎంపీలలో పశ్చాత్తాపం కోసం, ఆత్మశుద్ధి కోసం తాను ఈ విధం చేశానని ఆయన తెలిపారు.   

Updated Date - 2020-09-22T18:05:47+05:30 IST