మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది

ABN , First Publish Date - 2021-08-04T04:17:33+05:30 IST

తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ రెండో దశలో రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ మీటింగ్‌హాల్‌లో వ్యవసాయ విస్తరణ అధికారులతో సమావేశం నిర్వహించారు.

మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

నెలాఖరులోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలి 

సిద్దిపేట జిల్లాలో 50 వేల వరకున్న పంట రుణాల మొత్తం రూ.87 కోట్లు

24,600 మంది రైతులకు రుణ విముక్తి

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట సిటీ, ఆగస్టు 3 : తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ రెండో దశలో రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ మీటింగ్‌హాల్‌లో వ్యవసాయ విస్తరణ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 24,600 మంది రైతులకు రుణ విముక్తి కానుంది. మొత్తం రూ.87 కోట్లు మాఫీ కానుందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి పక్షం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సాగులో వస్తున్న నూతన మెలకువలుపై రైతులను చైతన్యవంతం చేసేందుకు రెండు వారాలకు ఒక శిక్షణా కార్యక్రమం రైతు వేదికలో నిర్వహించాలన్నారు. జిల్లాలో ఆయిల్‌ఫామ్‌, సెరి కల్చర్‌ సాగుపై వ్యవసాయ విస్తరణ అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవలన్నారు. ఆయిల్‌పామ్‌ సాగునుపై అవగాహన నిమిత్తం అశ్వారావుపేటలో క్షేత్ర సందర్శనకు ఏఈవో లను తీసుకెళ్లాలని జిల్లా ఉద్యానవన అధికారికి సూచించారు. జిల్లాలోని ఆదర్శ రైతులను రైతు వేదికల వద్దకు ఆహ్వానించి వారితో వారి అనుభవాలను క్లస్టర్‌ పరిధిలోని రైతులకు వివరించేలా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వరి వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్న రైతుల పంట పొలాలను వ్యవసాయ సందర్శించి మెలుకువలను గ్రహించాలన్నారు. తన క్లస్టర్‌ పరిధిలోని రైతులతో సత్సంబంధాలను కలిగి ఉంటూ సాగు మెలకువలు ఎప్పటికప్పుడు వారికి తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి రైతులను చైతన్యవంతం చేస్తున్న నారాయణపేట వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జునను మంత్రి అభినందించారు. నాగార్జునను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఏఈవోలు తమ పరిధిలోని రైతులకు  సామాజిక మాధ్యమాలు వేదికగా పలు సూచనలివ్వాలని కోరారు.


గొర్రెల యూనిట్ల ధర పెంపు

గొర్రెల యూనిట్‌ పెంచిన ధరను రూ.1.75 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. పెంచిన యూనిట్‌కు అనుగుణంగా ప్రభుత్వ, లబ్ధిదారుల వాటా పెరుగుతుందని తెలిపారు. ఒక యూనిట్‌కు కచ్చితంగా 21 గొర్రెలు వస్తాయన్నారు. జిల్లాలో ఇప్పటికే డీడీలు కట్టి పాత యూనిట్‌లు గ్రౌండింగ్‌ కానీ 300 మంది అర్హులకు పెంచిన ధర వర్తిస్తాయన్నారు. త్వరలో చేపట్టనున్న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి అధికారులు సర్వ సన్నద్ధం కావాలని మంత్రి సూచించారు. సొసైటీలను క్రియాశీలం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-04T04:17:33+05:30 IST