రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ

ABN , First Publish Date - 2022-05-27T05:47:25+05:30 IST

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, మిషన్‌ భగీరథ, విద్యుత్‌శాఖ అధికారులు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 50 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. మిగిలిన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఆదేశించారు.

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ
సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

పట్టణ ప్రజలకు నిత్యం తాగునీటి సరఫరా

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట అగ్రికల్చర్‌, మే 26 : ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, మిషన్‌ భగీరథ, విద్యుత్‌శాఖ అధికారులు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 50 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. మిగిలిన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పలు రైస్‌మిల్లులను సీజ్‌ విషయంపై సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు.


కోదండరావుపల్లి భూ సమస్యకు వారంలో పరిష్కారం

కోదండరావుపల్లి గ్రామంలో 60 ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యకు వారం రోజుల్లో పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను గ్రామస్థులకు చెందేలా చూడాలని కలెక్టర్‌ హన్మంతరావు, అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డికి ఆదేశించారు. సమస్యపై సీసీఏల్‌ఏ రెవెన్యూ అంశాలు, ఆమోదంపై ఉన్నతాధికారుల చొరవపై చర్చించారు. అలాగే, జిల్లాలోని నిర్వాసిత ఇళ్లు, ప్లాట్లకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్లశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జాను మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో ఆదేశించారు. జిల్లాలోని మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, అంతగిరి రిజర్వాయరులోని నిర్వాసితులకు కేటాయించిన ఇళ్లు 6 వేల వరకూ ఉంటాయని తెలియజేశారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఆయా ఇళ్లు, ప్లాట్లకు రోజువారీగా రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు. మే 31న రైల్వే సమీక్షకు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని వెల్లడించారు. వారితో చర్చించాల్సిన అంశాలపై నివేదికలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. 


పట్టణ ప్రజలకు నిత్యం తాగునీటి సరఫరా

సిద్దిపేట పట్టణ ప్రజలకు అంతరాయం లేకుండా నిత్యం తాగునీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి  తెలిపారు. ప్రస్తుతం ప్రతీరోజు 250 లక్షల లీటర్ల నీళ్లు అవసరమని వివరించారు. రెండు దశాబ్దాల ముందుచూపుతో మల్లన్నసాగర్‌ నుంచి రింగ్‌మేన్‌ ద్వారా 450 లక్షల లీటర్ల తాగునీరు తెచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. సిద్దిపేట పట్టణ రింగురోడ్డు చుట్టూ 11 కిలోమీటర్ల మేర రింగ్‌మేన్‌ పనులు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా క్రమపద్ధతిలో పైపులెన్‌ వేయాలని మిషన్‌భగీరథ అధికారులను ఆదేశించారు. కొత్తగా పట్టణ పరిధిలో చేరిన ప్రాంతాల కోసం 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో నాలుగు మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి మంత్రి ఆమోదం తెలిపారు. సమీక్షలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ సీఈ విజయ్‌ప్రకాశ్‌, ఎస్‌ఈ శ్రీనివా్‌సచారి, ఈఈ రాజయ్య, తహసీల్దార్లు విజయ్‌, ఉమారాణి, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:47:25+05:30 IST