వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-11-17T21:17:02+05:30 IST

వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం రైతుల పక్షాన టీఆర్‌ఎస్‌

వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: హరీష్‌రావు

హైదరాబాద్: వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం రైతుల పక్షాన టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహాధర్నా చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందన్నారు. పంజాబ్‌లో ఎలా కొంటారు.. తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు. రాష్ట్రానికో విధానంతో కేంద్రం ఏంచెప్పదల్చుకుందని హరీష్‌రావు నిలదీశారు. 



రేపు ఇందిరా పార్కు వద్ద ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మహాధర్నా చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత మరో రెండు రోజుల పాటు వేచి చూస్తామని, అప్పటికీ కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే బీజేపీని వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు. ‘‘విడిచిపెట్టం. మేము ఉద్యమకారులం. భయంకరమైన ఉద్యమాలు చేసి, తెలంగాణను సాధించాం. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఎంతకైనా తెగిస్తాం. వెనక్కిపోయే ప్రశ్నే ఉండదు’’ అని కేసీఆర్ అన్నారు. 

Updated Date - 2021-11-17T21:17:02+05:30 IST