Abn logo
Mar 26 2020 @ 15:47PM

తప్పు నాది కూడా ఉంది మెగాస్టార్: హరీష్ శంకర్

మెగాస్టార్ చిరంజీవి ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్‌లో మెగాస్టార్‌కు శుభాకాంక్షలు హోరెత్తుతున్నాయి. తనకి స్వాగతం పలికిన సెలబ్రిటీలందరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితం అయిన వారందరికీ చిరంజీవి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వినోదం పంచుతుండటం విశేషం. మోహన్ బాబు స్వాగతానికి ఆసక్తికరంగా స్పందించిన చిరు, తన మేనల్లుడు సాయిధరమ్ స్వాగతానికి కౌంటర్ వేస్తూ.. కామెడీని పండించారు.


ముందుగా సాయిధరమ్ తేజ్ చిరు ఎంట్రీని పురస్కరించుకుని ‘వెల్‌కమ్ బాస్’ అంటూ స్వాగతం పలికారు. దీనికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా చిరు పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్‌లో.. ‘ఇకపై నా సినిమాలలోని సాంగ్స్‌ని రీమిక్స్ చేసేముందు ఈ వేదిక (ట్విట్టర్) ద్వారా నన్ను అడుగు..’’ అని రిప్లయ్ ఉంది. దీనికి సాయిధరమ్‌తో చిరు సాంగ్‌ని రీమిక్స్ చేయించిన హరీష్ శంకర్ రిప్లయ్ ఇస్తూ.. ‘‘తప్పు నాది కూడా లేకపోలేదు.. పాపం మా సాయితేజ్ తమ్ముడిని ఒక్కడినే దోషిని చేయకండి..’’ అంటూ ట్వీట్ చేశారు.



Advertisement
Advertisement
Advertisement