యూత్ మనకంటే తెలివైనవాళ్లు: హరీశ్ రావు

ABN , First Publish Date - 2021-03-14T02:33:26+05:30 IST

యువత మనకంటే తెలివైనవోళ్లండి. వారిని పడేయడం అంత ఈజీకాదు కదా... వాళ్లు రామాలయం అన్నంత మాత్రాన.. మేము

యూత్ మనకంటే తెలివైనవాళ్లు: హరీశ్ రావు

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య క్రికెట్ మైదానంలో ఎక్కువగా కనిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు. కుర్రకారుతో కలిసి సరదాగా ఓ ఆట ఆడుతున్నారు. సీరియస్ పొలిటీషియన్, చక్కని అడ్మినిస్ట్రేటర్ నుంచి స్పోర్ట్స్‌మన్ అవతారం ఎత్తారు. ఇదే విషయాన్ని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఆయన దగ్గర ప్రస్తావించింది. కొత్తగా క్రికెట్ ఆడటం వెనక యువత కోసమేనా అని అడగగా ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘‘చిన్నప్పుడు కూడా క్రికెట్ ఆడేవాడిని. టైమ్ దొరికితే క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడుకునేలా ఫ్లడ్ లైట్‌లతో ఉన్న స్టేడియాన్ని సిద్దిపేటలో ప్రారంభించిన సందర్భంగా ఆడాను. రిలాక్సేషన్ కోసం అలా సరదాగా ఆడా. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడలేమండి. నీతి,నిజాయితీ, పర్ఫార్మెన్స్ చూస్తారు. సెంటిమెంట్, తాత్కాలిక తాయిలాలతో ఎవరూ రారు. యువత మనకంటే తెలివైనవోళ్లండి. వారిని పడేయడం అంత ఈజీకాదు కదా... వాళ్లు రామాలయం అన్నంత మాత్రాన.. మేము క్రికెట్ అన్నంత మాత్రాన మారిపోతారా... యూత్‌కు కావలసింది.. మంచి విద్య, ఉపాధి అవకాశాలు, మంచిపెట్టుబడులు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు... ఏ దేశమూ, ఏ రాష్ట్రమూ ఇవ్వలేదు. ఇవ్వజాలదు. వాళ్లు వ్యాపారవేత్తలు కావాలి... ఆర్థికంగా బలంగా ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు.

Read more