నల్ల‌ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల‌ విజయం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-11-19T17:51:42+05:30 IST

ఏడాది కాలంగా బుల్లెట్‌లకు, లాఠీలకు, వాటర్ కానన్‌లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి రైతులు విజయం సాధించిన తీరు అద్భుతమని ట్విటర్ వేదికగా మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

నల్ల‌ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల‌ విజయం: హరీష్‌రావు

హైదరాబాద్: ఏడాది కాలంగా బుల్లెట్‌లకు, లాఠీలకు, వాటర్ కానన్‌లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి రైతులు విజయం సాధించిన తీరు అద్భుతమని ట్విటర్ వేదికగా మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. నల్ల‌ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల‌ విజయంగా ఆయన అభివర్ణించారు. ‘‘రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల‌ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల‌ విజయం. ఏడాది కాలంగా బుల్లెట్‌లకు, లాఠీలకు, వాటర్ కానన్‌లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అద్భుతం. రాత్రింబవళ్ళు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారు. ఇది రైతు విజయం, ఇది దేశ ప్రజల విజయం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలు’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2021-11-19T17:51:42+05:30 IST