Abn logo
Sep 27 2021 @ 14:12PM

బీజేపీ ధరలు పెంచి... దొడ్డు వడ్లు కొనమంటోంది: హరీష్‌రావు

కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఎరువులు కావాలంటే గతంలో పోలీస్ స్టేషన్ ముందు క్యూ కట్టేవాళ్ళమన్నారు. కేసీఆర్ వచ్చాక రైతుల పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. రైతుల జీవితాల్లో వెలుగును నింపాలని రైతు బంధు, బీమాలు తెచ్చారని హరీష్‌రావు పేర్కొన్నారు. బీజేపీ ధరలు పెంచి... దొడ్డు వడ్లు కొనమంటోందన్నారు. 7 ఏళ్ళు మంత్రిగా ఉండి ఈటల ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు. సంజయ్ ఎంపీగా గెలిచి పది రూపాయల పని చేయలేదని హరీష్ రావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...