కేంద్ర ప్రభుత్వంపై Harish Rao విమర్శలు

ABN , First Publish Date - 2022-06-08T21:12:34+05:30 IST

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు (Harish Rao) విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వంపై Harish Rao విమర్శలు

మెదక్‌: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు (Harish Rao) విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రానికి ఎప్పుడూ ఏదో సంస్థను అమ్మాలనే ఆలోచనే ఉందని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వానిది వ్యాపార ధోరణేనని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ (RTC)ని అమ్మేయడం ఖాయమన్నారు. డబుల్ డెక్కర్ గవర్నమెంట్ ఉన్న చోట్ల 6 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని తెలిపారు. సంస్థలను అమ్మడం కాదని, కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకెళ్లారని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.9 వేల కోట్లను కేంద్రం ఇవ్వలేదని హరీష్‌రావు విమర్శించారు. 

Updated Date - 2022-06-08T21:12:34+05:30 IST