యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిర్వహణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీష్‌రావు (Harish Rao) ఆరోపించారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS)ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఎయిమ్స్ ఇచ్చి మూడేళ్లు అయినప్పటికీ, తట్టెడు మట్టి తీయలేదన్నారు. బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతల్లో కన్పించడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.45కోట్లతో నిర్మించి ఇచ్చిన భవనం తప్ప, నూతనంగా ఒక్కగదిని కూడా కొత్తగా నిర్మించలేదన్నారు. ఎయిమ్స్‌లో గతంలో నిమ్స్ అందించిన సేవలే ఇప్పటికే కొనసాగుతున్నాయని హరీష్‌రావు తెలిపారు.