Aug 4 2021 @ 13:30PM

తాప్సీ `మిష‌న్ ఇంపాజిబుల్‌`లో మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు

తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో అడుగు పెట్టి స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ తాప్సీ. రీసెంట్‌గా ఈమె టాలీవుడ్‌లో `మిష‌న్ ఇంపాజిబుల్‌` సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో తాప్సీ లీడ్ రోల్ చేస్తుంది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రంతో హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్.ఎస్‌.జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ స్టార్స్ అంద‌రూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు హ‌రీశ్ పేర‌డి న‌టిస్తున్నారు. మ‌డ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్‌, విక్ర‌మ్ వేద ఇలా న‌ల‌బైకి పైగా చిత్రాల్లో న‌టించి, త‌న‌దైన విల‌నిజంతో గుర్తింపు సంపాదించుకున్న ఈయ‌న `మిష‌న్ ఇంపాజిబుల్‌`లో ఎలాంటి పాత్ర‌లో కనిపించ‌నున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.