Abn logo
Sep 18 2020 @ 03:39AM

ఐదో స్థానంలో హరికృష్ణ

చెన్నై: సెయింట్‌ లూయిస్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో రెండోరోజు తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ పెంటేల హరికృష్ణకు కలిసి రాలేదు. ర్యాపిడ్‌ విభాగంలో భాగంగా జరిగిన నాలుగు, ఐదు, ఆరు గేముల్లో హరి రెండింటిలో ఓడి, ఒకటి డ్రా చేసుకున్నాడు. దీంతో అతను ఆరు పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయాడు. నాలుగో గేమ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్‌ ఇయాన్‌ నెపోమ్నియాచి చేతిలో 44 ఎత్తుల్లో ఓడిన హరికృష్ణ.. తర్వాత లెవొన్‌ అరోనియన్‌ (అమెరికా)తో ఐదో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఇక.. ఆరో గేమ్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో పోరులో హరి 31 ఎత్తుల్లో ఓటమిపాలయ్యాడు. టైటిల్‌ ఫేవరెట్‌ కార్ల్‌సన్‌ వరుసగా మూడు విజయాలతో (9 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement