Harihara Veeramallu : జనవరికి వాయిదా పడిన షూటింగ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.  ‘భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు’ చిత్రాల్ని ఒకేసారి పట్టాలెక్కించిన ఆయన హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నారు. అయితే వీటిలో పవన్ ‘భీమ్లా నాయక్’ చిత్రానికే తొలి ప్రాధాన్యత నివ్వబోతున్నారు. కారణం సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.  అందుకే ఆయన పాత్రకి సంబంధిచిన డబ్బింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. దీని కారణంగా ఆయన తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ కు అవాంతరాలు ఏర్పడ్డాయి. 


నిజానికి డిసెంబర్ నుంచి ‘హరిహర వీరమల్లు’ చిత్రం తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావాలి. అయితే ‘భీమ్లా నాయక్’ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనుల్ని పూర్తి చేశాకా.. ‘వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొనాలని పవన్ అనుకుంటున్నారట. దాని వల్లే  ఈ సినిమా షూటింగ్ ను జనవరికి వాయిదా వేశారని టాక్. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ రాజస్థాన్ లో లొకేషన్స్ వేటలో ఉన్నారట. అది పూర్తికాగానే.. జనవరి నుంచి రాజస్థాన్ లో ‘హరిహర వీరమల్లు’ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. పవర్ స్టార్ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా విశేషాన్ని సంతరించుకున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఆయన గజదొంగగా నటిస్తున్నారు. మొఘలాయిల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా..  కీరవాణి సంగీతం అందిస్తున్నారు.   

Advertisement