Oct 20 2021 @ 14:13PM

Harihara Veeramallu : అక్టోబర్ 25న షూటింగ్ పునఃప్రారంభం!

‘వకీల్‌సాబ్’ బ్లాక్ బస్టర్ హిట్ తో మూడేళ్ళ గ్యాప్ ను అభిమానులు మరిచిపోయేలా చేయగలిగారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన వరుస సినిమాల్ని ట్రాకెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం భీమ్లానాయక్ , హరిహరవీరమల్లు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. తదుపరిగా హరీశ్ శంకర్, సురేంద్రరెడ్డి సినిమాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి అనిల్ రాడిపూడి, శేఖర్ కమ్ముల, పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులు రెడీగా ఉన్నారు. ఇక ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకూ 50శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ‘కొండపొలం’ రిలీజ్ అండ్ ప్రమోషన్స్ కారణంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమా షూటింగ్ ను హోల్డ్ లో పెట్టారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గొనబోతున్నారు. ఈ నెల 25న ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. 



17వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో ఫిక్షనల్ స్టోరీగా ‘హరిహర వీరమల్లు’ జానపద సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను నిర్మించి, హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దింపారు దర్శకుడు క్రిష్. ఇంకా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేశారు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎప్పటికి పూర్తయి, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.