హరిద్వార్ విధ్వేష ప్రసంగం: మరో 10 మందిపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2022-01-03T20:50:46+05:30 IST

హరిద్వార్ స్థానికుడు నదీమ్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిద్వార్‌లోని జ్వాలాపూర్ పోలీస్‌ స్టేషన్‌లో తాజాగా పది మందిపై కేసు నమోదు అయింది. ఈ విసయమై జ్వాలాపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ..

హరిద్వార్ విధ్వేష ప్రసంగం: మరో 10 మందిపై ఎఫ్ఐఆర్

డెహ్రడూన్: గాంధీపై విమర్శలు చేయడమే కాకుండా ముస్లింలపై బెదిరింపులతో హరిద్వార్‌లో విధ్వేష ప్రసంగాలు చేసినందుకు గాను యతి నర్సింగానంద్ సహా మరో 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం సాధువు యతి నర్సింగారావు ఒక్కరి మీదే ఫిర్యాదు నమోదు చేశారు. కాగా, హరిద్వార్‌కు సంబంధించిన కొంత సమాచారం తీసుకున్న అనంతరం మరో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు.


హరిద్వార్ స్థానికుడు నదీమ్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిద్వార్‌లోని జ్వాలాపూర్ పోలీస్‌ స్టేషన్‌లో తాజాగా పది మందిపై కేసు నమోదు అయింది. ఈ విసయమై జ్వాలాపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ‘‘సెకండ్ ఎఫ్ఐఆర్‌లో పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నర్సింగానంద్‌పై ఇంతకు ముందే ఎఫ్ఐఆర్ నమోదు అయింది. తాజాగా జితేంద్ర నారాయణ్ త్యాగి (కొద్ది రోజుల క్రితం మతం మార్చుకుని వసీం రిజ్వీ నుంచి జితేంద్ర త్యాగిగా మారారు), సింఘు సాగర్, ధరందాస్, పరమానంద, సాధ్వి అన్నపూర్ణ, ఆనంద్ స్వరూప్, అశ్విణి ఉపాధ్యాయ్, సురేష్ చవాన్, ప్రబోధానంద్ గిరి‌లపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది’’ అని అన్నారు.

Updated Date - 2022-01-03T20:50:46+05:30 IST