హరిద్వార్ విద్వేష ప్రసంగం: నర్సింగానంద్ విడుదల.. పూలతో స్వాగతం

ABN , First Publish Date - 2022-02-19T00:50:46+05:30 IST

యతి నర్సింగానంద్ కారు జైలు పరిసరాల్ని చేరుకోగానే రైట్ కాషాయ కండువాలతో వచ్చిన కొందరు ఆయన పూలమాలలు వేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సింగానంద్ నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

హరిద్వార్ విద్వేష ప్రసంగం: నర్సింగానంద్ విడుదల.. పూలతో స్వాగతం

న్యూఢిల్లీ: మహాత్మ గాంధీపై విద్వేష వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్ జైలు నుంచి విడుదల అయ్యారు. కాగా, ఆయనకు పూల మాలలతో స్వాగతం పలకడం విశేషం. గత నెలలో అరెస్టైన నర్సింగానంద్ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, యతి నర్సింగానంద్ కారు జైలు పరిసరాల్ని చేరుకోగానే రైట్ కాషాయ కండువాలతో వచ్చిన కొందరు ఆయన పూలమాలలు వేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సింగానంద్ నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


నర్సింగానంద్ విడుదలైన అనంతరం సర్వానంద్ ఘాట్‌కు వెళ్లారు. నర్సింగానంద్‌తో పాటు అరెస్టైన జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిని విడుదల చేయాలంటూ దీక్ష చేపట్టిన వారిని పలకరించి వారి చేత దీక్ష విరమింపజేశారు. కాగా, త్యాగికి ఇంకా బెయిల్ లభించలేదని, ఆయన బెయిల్ పిటిషన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం విచారించనుందని నర్సింగానంద్ తెలిపారు.


నెల రోజుల క్రితం హరిద్వార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ‘‘గాంధీ మోసగాడు, హిందూ వ్యతిరేకి. వాస్తవానికి గాంధీ ముస్లిం కానీ హిందూలోకి రహస్యంగా మారారు. గాంధీ, నెహ్రూలు చేసిన ద్రోహం వల్ల ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులకు తమ ఇల్లు ఇదే అని చెప్పుకోలేకపోతున్నారు. నేను గాంధీని చెత్త కుప్పతో పోలుస్తాను. నా దృష్టిలో గాడ్సే దేవుడు’’ అని వ్యాఖ్యానించారు. ఇక ముస్లింల గురించి మాట్లాడుతూ ‘‘భగవద్గీతో పాండవులకు శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం మనం గుర్తుంచుకోవాలి. కౌరవులను చంపడానికి పాండవులను శ్రీకృష్ణుడు ప్రోత్సహించారు. ఇప్పుడు దీని గురించి అడిగితే కృష్ణుడు కూడా ధ్వేషపూరిత ప్రసంగం చేశాడంటారు. అయితే, తమ ప్రాంతాన్ని, తమ ప్రజలను కాపాడుకోవడానికే కృష్ణుడు అలా చెప్పాడని మనం అర్థం చేసుకోవాలి’’ అని యతి నర్సింగానంద్ అన్నారు.

Updated Date - 2022-02-19T00:50:46+05:30 IST