హరిదాసుల పాత్ర ఎనలేనిది

ABN , First Publish Date - 2021-01-16T05:35:10+05:30 IST

పెద్దాపురం, జనవరి 15: హిందూ సంప్రదాయాల పరిరక్షణలో హరిదాసుల పాత్ర ఎనలేనిదని హిందూ ధర్మరక్షా సమితి సభ్యులు పేర్కొన్నారు

హరిదాసుల పాత్ర ఎనలేనిది
కట్టమూరులో హరిదాసును సత్కరిస్తున్న గ్రామస్థులు

పెద్దాపురం, జనవరి 15: హిందూ సంప్రదాయాల పరిరక్షణలో హరిదాసుల పాత్ర ఎనలేనిదని హిందూ ధర్మరక్షా సమితి సభ్యులు పేర్కొన్నారు. మండలంలోని కట్టమూరులో హిందూ ధర్మరక్షా సమితి, గ్రామస్థుల ఆధ్వర్యాన కేశవ, పట్టాభిరామస్వామి దేవస్థానంలో శుక్రవారం హరిదాసుకు ఘన సత్కారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురానికి చెందిన హరిదాసు కొనపాకుల వేణుకు ఆర్థిక ప్రోత్సాహంతో పాటు పూలమాలలు దుశ్శాలువాలతో సత్కరించారు. పీఎ్‌సవీఎన్‌ ఆచార్యులు, అడపా శ్రీనివాస్‌, మాదిరెడ్డి అప్పన్న, వీరాంజనేయులు, గోవిందు, తాతారావు, చంటిబాబు, గుర్రపు వీరబాబు, ఆకుల గంగాధర్‌, మాదిరెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు.

లింగంపర్తిలో హరిదాసుకు సన్మానం 

ఏలేశ్వరం, జనవరి 15: మండల పరిధిలోని లింగంపర్తి  అల్లూరి సీతారామరాజు సత్రంపంపు కాలనీలో గల దుర్గామల్లేశ్వరస్వామివారి ఆలయం వద్ద నెల రోజులు నిర్వహించే ధనుర్మాస నగర సంకీర్తన ఉత్సవాల సందర్భంగా కళాకారులకు సన్మానం చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ సభ్యు లు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగ కళాకారుడు ఆలమూరు సుబ్బారావు, సుబ్బలక్ష్మి దంపతుల నేతృత్వంలో హరిదాసు నీలాల కనకదుర్గారావును ఘనంగా సన్మానించి ధాన్యం, నూతన వస్ర్తాలు అందజేశారు. పిడుగు భధ్రం, గొంపా అప్పారావు, అనుబోలు లక్ష్మి, నక్కా రాజారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:35:10+05:30 IST