సమరయోధులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-07T05:20:37+05:30 IST

స్వాత్రంత్య సమరయోధులను స్మరించుకోవాలని, నాయకుల సేవలు, ఆలోచన విధానాన్ని యువత అందిపుచ్చుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

సమరయోధులను స్మరించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి, తదితరులు

ప్రతి ఇంటిపై ఈనెల 13 నుంచి 15 వరకు జాతీయ జెండా ఎగుర వేయాలి : కలెక్టర్‌ ప్రశాంతి

 కాళ్ళ, ఆగస్టు 6: స్వాత్రంత్య సమరయోధులను స్మరించుకోవాలని, నాయకుల సేవలు, ఆలోచన విధానాన్ని యువత అందిపుచ్చుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. శనివారం పెదఅమిరం వెస్ట్‌బెర్రీ హైస్కూల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జరుగుతున్న హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత కలెక్టర్‌తో కలిసి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారి గురించి చదువుకుని జీవితంలో వాటిని అనుసరించాలని సూచించారు. ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతీ ఇంటిపైనా మువ్వన్నెల జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు.  ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ దేశ నాయకులను విద్యార్థులు, యువత స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేయాలన్నారు. అనంతరం మువ్వన్నెల బెలూన్లును గాలిలోకి ఎగురవేశారు. ఆర్డీవో దాసి రాజు, ఆకివీడు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ జామి హైమావతి, తహసీల్దార్లు ఎస్‌కే హుస్సేన్‌, ఎంపీడీవోలు ఏవీ అప్పారావు, ఎన్‌ఎం గంగాధరరావు, ఎస్‌.శ్రీకర్‌, జి.స్వాతి,  ఆకివీడు ఎంపీపీ కె.జయలక్ష్మి, జన విజ్ఞానవేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి, వెస్ట్‌ బెర్రీ స్కూల్‌ డైరెక్టర్‌ నడింపల్లి మహేష్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ సత్యవోలు హైమావతి, విద్యార్థులు  పాల్గొన్నారు. 

సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం

పెంటపాడు : సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని పశు సంవర్ధకశాఖ జిల్లా అధికారి డాక్టర్‌ కె.మురళీకృష్ణ అన్నారు. తాడేపల్లిగూడెం  పశుసంవర్ధక శాఖ డివిజన్‌ ఆధ్వర్యంలో శనివారం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, మానవహారం నిర్మించారు. అనంతరం  పెంటపాడు నుంచి బదిలీపై వెళ్లిన పశుగణాభివృద్ధి సంస్థ డీడీ డాక్టర్‌ అడబాల విశ్వేశ్వరరావు, ఏడీ డాక్టర్‌ సంధాని బాషాను సత్కరించారు. కార్యక్రమంలో పశుగణాభివృద్దిసంస్థ డాక్టర్‌ నరసింహమూర్తి, వెటర్నరీ వైద్యుడు పి.మహేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వీరవాసరం : అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ఘర్‌ తిరంగాలో భాగంగా వీరవాసరం ప్రభుత్వశాఖల అధికారులు జాతీయ పతాకాలు చేపట్టి ప్రదర్శనలు చేశారు. తహసీల్దార్‌ కార్యాయలయం నుంచి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ సుందరరాజు మాట్లాడుతూ త్రివర్ణ పతాక స్ఫూర్తిని ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని కోరారు. డ్వామా పీడీ ఎస్‌టీవీ రాజేశ్వరరావు, ఈవోపీఆర్‌డీ బి.శ్రీరామచంద్రమూర్తి, ఆర్‌ఐ రూజ్‌వెల్ట్‌, నాగేశ్వరరావు, వీఆర్‌వోలు పాల్గొన్నారు. 

ఆకివీడు : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా శనివారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో చైర్మన్‌ జామి హైమావతి జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ చోడగం వెంకటేశ్వరరావు, మేనేజర్‌ వెంకటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.

భీమవరం టౌన్‌ : దేశభక్తి, త్యాగం, స్వాతంత్య్రభారతం అనే లక్ష్యాలతో భారతీయులు ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాడారని, భారతీ యుల దేశ భక్తికి ఆంగ్లేయులు ఆశ్చర్యపోయారని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రమణారావు అన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏఆర్‌కేఆర్‌ మునిసి పల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులతో జాతీయ జెండాతో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వాహకుడు చెరుకువాడ రంగసాయి మాట్లాడారు. లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి నరహరిశెట్టి కృష్ణ, హెచ్‌ఎం ఏవీ సత్యనరాఆయణ, పీఈటీ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

పెనుమంట్ర : ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలమే దేశానికి స్వాతం త్య్రం సిద్ధించిందని పొలమూరు సర్పంచ్‌ కాకర రాజేశ్వరరావు అన్నారు. శనివారం పొలమూరులో ఆజాదీకా అమృత్సోవం కార్యక్రమంలో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఉన్నత పాఠశాల విద్యార్థులతో నిర్వ హించారు. హెచ్‌ఎం బండి ఆంజనేయులు, ఎంపీటీసీ పెచ్చెటి సరసింహ మూర్తి, తాడిపర్తి సంపత్‌రావు, కోడి చంద్రశేఖర్‌, సంకు తాతయ్య, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌ : ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎ.నాగమల్లీశ్వరి సూచించారు. తాడేపల్లిగూడెంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీని జడ్పీ పాఠశాల విద్యార్థులతో నిర్వహించారు. రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సి.రమ్య, హెచ్‌ఎం, సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2022-08-07T05:20:37+05:30 IST