కష్టపడితేనే ఫలితం!

ABN , First Publish Date - 2020-10-16T05:38:24+05:30 IST

రామాపురం అనే గ్రామంలో శ్రీను అనే వ్యాపారి ఉండేవాడు. అతను చెరకు రసం అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఊళ్లో వాళ్లందరూ అతని చెరకు రసాన్ని ఇష్టపడేవారు. ఒకరోజు దేవదూత ఆ మార్గాన వెళుతూ ఉండగా బాగా దాహం వేసింది...

కష్టపడితేనే ఫలితం!

రామాపురం అనే గ్రామంలో శ్రీను అనే వ్యాపారి ఉండేవాడు. అతను చెరకు రసం అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఊళ్లో వాళ్లందరూ అతని చెరకు రసాన్ని ఇష్టపడేవారు. ఒకరోజు దేవదూత ఆ మార్గాన వెళుతూ ఉండగా బాగా దాహం వేసింది. అటూ ఇటూ చూస్తే శ్రీను చెరకు రసం కొట్టు కనిపించింది. వెంటనే వెళ్లి చెరకు రసం తాగి తన దాహం తీర్చుకుంది. రుచిగా ఉండడంతో దేవదూతకు బాగా నచ్చింది. తన దాహం తీర్చినందుకు శ్రీనుకి ఒక డబ్బుల మూటను బహుమతిగా ఇచ్చింది.


అంతేకాకుండా రోజూ కొట్టుకు వచ్చి చెరకు రసం తాగి ఒక డబ్బుల మూటను ఇచ్చి వెళ్లేది. కొన్ని రోజులు పోయాక రోజూ డబ్బుల మూట వస్తుండటంతో శ్రీనుకు బద్దకం పెరిగింది. పగలంతా ఇంట్లో విశ్రాంతి తీసుకుని, దేవదూత వచ్చే సమయానికి మాత్రమే కొట్టు తీసేవాడు. దేవదూత వెళ్లిపోయాక కొట్టు మూసేవాడు. ఈ విషయాన్ని దేవదూత గమనించింది. మరుసటి రోజు నుంచి కొట్టుకు రావడం మానేసింది. దాంతో శ్రీను తన తప్పును తెలుసుకుని బుద్దిగా కొట్టు తీసి, కష్టపడి చెరకు రసం అమ్మి కుటుంబాన్ని పోషించుకున్నాడు.

Updated Date - 2020-10-16T05:38:24+05:30 IST