బీజేపీకి హార్ధిక్ పటేల్ ప్రశంసలు.. కాంగ్రెస్‌లో కలవరం

ABN , First Publish Date - 2022-04-23T01:41:21+05:30 IST

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యం దక్కడంలేదంటూ కొంతకాలంగా అసహంతో రగిలిపోతున్న గుజరాత్‌ నేత, పటీదార్ ఆందోళన్ నాయకుడు హార్ధిక్ పటేల్ మరోమారు సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు.

బీజేపీకి హార్ధిక్ పటేల్ ప్రశంసలు.. కాంగ్రెస్‌లో కలవరం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యత దక్కడంలేదంటూ కొంతకాలంగా అసహంతో రగిలిపోతున్న గుజరాత్‌ నేత, పటీదార్ ఆందోళన్ నాయకుడు హార్ధిక్ పటేల్ మరోమారు తన అసంతృప్తిని బయటపెట్టారు. సొంత  పార్టీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం లేదంటూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా బీజేపీని పొగిడారు. ‘‘ కొన్ని విషయాల్లో బీజేపీ బాగుంది, ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కలవరానికి గురిచేస్తోంది. పార్టీ మార్పుపై హార్ధిక్ పటేల్  సంకేతాలిచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో తాను ఎలాంటి చర్చలు జరపలేదని, పార్టీ మార్పుపై వెలువడుతున్న కథనాలను హార్ధిక్ పటేల్ ఖండిస్తున్నా కాంగ్రెస్‌ను మాత్రం సందేహాలు వీడడం లేదు. ఎన్నికలకు సరిగ్గా కొన్ని నెలల ముందు హార్ధిక్ పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పెద్దలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి.  రాజకీయంగా ఇటివల బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను హార్ధిక్ పటేల్ సమర్థించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి సత్తా ఉందని ఒప్పుకోవాలన్నారు. బీజేపీ నిర్ణయాలను సమర్థించకపోయినా, వారిని పొగడకపోయినా.. కనీసం వాస్తవం గుర్తించాలి కదా అని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ బలపడాలనుకుంటే నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం పెంపొందించుకోవాలని హార్ధిక్ పటేల్ అన్నారు.

Updated Date - 2022-04-23T01:41:21+05:30 IST