Rahulపై నమ్మకం లేకే Hardik ఉద్వాసన: Owasi

ABN , First Publish Date - 2022-05-18T21:49:41+05:30 IST

ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పాటీదార్ ఉద్యమ నేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్..

Rahulపై నమ్మకం లేకే Hardik ఉద్వాసన: Owasi

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పాటీదార్ ఉద్యమ నేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ (Hardik patel) రాజీనామా చేయడంపై ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owasi) బుధవారంనాడు ఓ ట్వీట్‌లో స్పందించారు. కాంగ్రెస్ అనధికార అధ్యక్షుడు (Rahul gandhi)పై నమ్మకం లేకనే హార్దిక్ రాజీనామా చేశారని అన్నారు. మహారాష్ట్రను 15 పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూడో స్థానానికి చేరిందని, ఢిల్లీలో మచ్చుకైనా లేకుండా పోయిందని విమర్శించారు. ఆ పార్టీ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ సైతం ఇప్పుడు రాహుల్‌పై నమ్మకం లేకనే పార్టీని విడిచి వెళ్లారని అన్నారు.


పాటీదార్ ఉద్యమ నేతగా కొద్దికాలం క్రితం ప్రచారంలోకి వచ్చిన హార్దిక్ పటేల్ ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల  అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో  సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అంతర్గత పోరు తారాస్థాయిలో ఉందని పలుమార్లు చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని చెబుతూనే అనూహ్యంగా బుధవారంనాడు పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. ఆ లేఖను Twitter లో కూడా షేర్ చేశారు. భవిష్యత్తులో గుజరాత్ కోసం మరింత ఉత్తమంగా పనిచేయడానికే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.

Updated Date - 2022-05-18T21:49:41+05:30 IST