తండ్రి కాబోతున్న హార్దిక్‌

ABN , First Publish Date - 2020-06-01T09:37:08+05:30 IST

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కానున్నాడు. కొత్త ఏడాదిన సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్‌ నిశ్చితార్థం చేసు కున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. తాను గర్భవతినని నటాషా ఆదివారం ఇన్‌స్టాలో

తండ్రి కాబోతున్న హార్దిక్‌

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కానున్నాడు. కొత్త ఏడాదిన సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్‌ నిశ్చితార్థం చేసు కున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. తాను గర్భవతినని నటాషా ఆదివారం ఇన్‌స్టాలో తెలిపింది. హార్దిక్‌తో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ‘మా ఇద్దరి ప్రయాణం మరింత అపురూపంగా మారనుంది. మా జీవితాల్లోకి కొత్త ప్రాణి రానుంది. ఇద్దరం ఎంతో ఉత్కంఠతో ఉన్నాం. మీ ఆశీర్వాదం కావాల’ని నటాషా రాసింది. ఈ సందర్భంగా హార్దిక్‌కు విరాట్‌ కోహ్లీ శుభాకాంక్షలు చెప్పాడు.

Updated Date - 2020-06-01T09:37:08+05:30 IST