Hardik Pandya: చెత్త ప్రదర్శన ఫలితం.. నేటి టీ20 నుంచి అవుట్?

ABN , First Publish Date - 2021-07-27T21:36:00+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న వైట్‌బాల్ సిరీస్‌లో దారుణంగా విఫలమవుతూ వస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా

Hardik Pandya: చెత్త ప్రదర్శన ఫలితం.. నేటి టీ20 నుంచి అవుట్?

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న వైట్‌బాల్ సిరీస్‌లో దారుణంగా విఫలమవుతూ వస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నేటి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. మూడు వన్డేలు, ఓ టీ20లో ఆడిన పాండ్యా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న రెండో టీ20లో అతడిని పక్కనపెట్టి మరో ఆటగాడికి చాన్స్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.


బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ హార్దిక్ విఫలమయ్యాడు. జట్టులో పాండ్యా కీలక ఆటగాడు అయినప్పటికీ నేటి మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇవ్వాలని కెప్టెన్ ధవన్, కోచ్ ద్రవిడ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 


మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హార్దిక్ 14 ఓవర్లు బౌలింగ్ వేశాడు. 6.92 ఎకానమీ, 48.50 సగటుతో రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగులో మూడు ఇన్సింగ్స్‌లలో కలిపి ఓ డక్ సహా 29 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టీ20లో 12 బంతుల్లో పది పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగులో లైన్ అండ్ లెంగ్త్ లేక ఇబ్బంది పడ్డాడు. ఫీల్డింగ్‌లోనూ తడబడ్డాడు. ఓ క్యాచ్‌ను మిస్ చేశాడు.   


భారత జట్టు నేటి ప్రాబబుల్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), పృథ్వీషా/దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్/మనీష్ పాండే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి. 

Updated Date - 2021-07-27T21:36:00+05:30 IST