హార్దిక్‌ గాయం చిన్నదే..!

ABN , First Publish Date - 2021-10-27T07:28:55+05:30 IST

భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా భుజానికైన గాయం ప్రమాదకరమైనదేమీ కాదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మంగళవారం.....

హార్దిక్‌ గాయం చిన్నదే..!

దుబాయ్‌: భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా భుజానికైన గాయం ప్రమాదకరమైనదేమీ కాదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మంగళవారం వెల్లడించింది. టీ20 వరల్డ్‌క్‌పలో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో భారత్‌ ఆడిన మ్యాచ్‌లో హార్దిక్‌ గాయపడడం తెలిసిందే. అదే రోజున హార్దిక్‌ భుజానికి స్కానింగ్‌ తీయించారు. ఆ రిపోర్టుల్లో గాయం తీవ్రత స్వల్పంగానే ఉందని వైద్యులు తెలపడంతో ఈనెల 31న న్యూజిలాండ్‌తో జరిగే పోరు నాటికి హార్దిక్‌ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక, ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్‌ వరల్డ్‌క్‌పలో నాకౌట్‌ పోటీల నుంచి బౌలింగ్‌ చేస్తానని పాక్‌తో మ్యాచ్‌ అనంతరం చెప్పడం అతడి ఫిట్‌నె్‌సపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Updated Date - 2021-10-27T07:28:55+05:30 IST