కార్మికులపై అధికారుల వేధింపులు తగవు

ABN , First Publish Date - 2021-01-23T06:51:19+05:30 IST

ఉన్నతాధికారుల వేధింపులతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులు నరకయాతన పడుతున్నారని ఎనఎంయూ రీజనల్‌ నాయకులు ముత్యాలప్ప, శంకరయ్య, గ్యారేజ్‌ కార్యదర్శి డీఆర్‌ కుమార్‌, డిపో కార్యదర్శి హనుమానలు ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులపై అధికారుల వేధింపులు తగవు
పుట్టపర్తిలో నిరసన తెలుపుతున్న ఎనఎంయూ నాయకులు

 ఎనఎంయూ ఆధ్వర్యంలో నిరసన

ధర్మవరంఅర్బన, జనవరి 22: ఉన్నతాధికారుల వేధింపులతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులు నరకయాతన పడుతున్నారని ఎనఎంయూ రీజనల్‌ నాయకులు ముత్యాలప్ప, శంకరయ్య, గ్యారేజ్‌ కార్యదర్శి డీఆర్‌ కుమార్‌, డిపో కార్యదర్శి హనుమానలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఎనఎంయూ నాయకులు ఎర్రబ్యాడ్జిలు ధరించి గేట్‌మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోనవ్యాప్తంగా ఉన్న ఉ ద్యోగుల సమస్యలపై పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. అందుకే జోనల్‌ కమిటీ పిలుపు మేరకు నిరసన చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇస్తున్న పనిష్మెంట్లను ఆపాలని, డ్యూటీ చార్టులు వేయాలని, మహిళా సిబ్బందికి సరైన విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పక్షపాతం చూపిస్తున్న డిపో మేనేజర్లు, ఎఎంలపై చర్యలు తీసుకోవాలన్నారు. కాలం చెల్లిన టిమ్‌ మిషన్లను మార్చాలని, సివిల్‌ ఇంజనీరింగ్‌ పనులను  గ్యారేజీలలో  చేపట్టాలని డ్రైవర్లకు రావాల్సిన సేఫ్టీ ఆలవెన్సులను చెల్లించాలని తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనఎంయూ నాయకులు బాలాజీ, భీమరాజు,నాగప్ప, మధు, మంజునాథ్‌, వైవీఎనరెడ్డి, భాస్కర్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

 పుట్టపర్తి: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎనఎంయూ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక బస్సు డిపోలో గేట్‌మీటింగ్‌ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేశారు. ఎండీ సర్కులర్‌కు విరుద్ధంగా చార్జీసీటులు ఇవ్వడం, ఇక్రిమెంట్‌లు కట్‌ చేసి ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జోనల్‌ జాయింట్‌ కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌, రీజనల్‌ ప్రెసిడెంట్‌ షబ్బీర్‌, నాయకులు బాబ్జాన, ఎస్వీ నారాయణ, శివశంకర్‌, గయాజ్‌, తిరుపతమ్మ, ప్రేమకుమారి, శివశంకర్‌రెడ్డి, శివారెడ్డి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

 కదిరిఅర్బన: తమ డిమాండ్‌ల సాధనకై ఆర్టీసీ కార్మికులు శుక్రవారం స్థానిక డిపో ఎదుట నేషనల్‌ మజ్దూర్‌ యూ నిటీ అసోసియేషన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎనఎంయూ రాష్ట్ర నాయకుడు ఎనవీ రమణ తదితరులు మాట్లాడుతూ  అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు పనిస్మెంట్లు ఇస్తున్నారన్నారు. అన్ని డిపోలలో డ్యూటీ చార్టులు వేయాలని, కొవిడ్‌లో తొలగించబడిన డేటాఎంట్రీ ఆపరేటర్‌లను వెంటనే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రేడ్‌-1 పదోన్నతులు, 9/18 స్పెషల్‌ గ్రేడ్‌లు ఇవ్వాలని, మహిళా సిబ్బందికి సరైన విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, గ్యారేజీలో సరైన టూల్స్‌ ఉంచాలని, అన్ని విభాగాలలో ఖా ళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎనఎంయూ నాయకులు బైరిశెట్టి, రామక్రిష్ణ, ఓబులేసు, అశ్వత్థమయ్య, బాషా, భాస్కర్‌, రవీంద్ర, సురేం ద్ర, డీఎల్‌ నారాయణ, నారాయణస్వామి, గంగన్న, బుల్లెట్‌ రామ్మోహన పాల్గొన్నారు.


Updated Date - 2021-01-23T06:51:19+05:30 IST