కంపెనీల్లో మహిళలపై వేధింపులు

ABN , First Publish Date - 2021-03-09T07:08:46+05:30 IST

కార్పొరేట్‌ కంపెనీల్లోనూ మహిళా ఉద్యోగులకు రక్షణ కరువవుతోంది. ఎన్ని చట్టాలున్నా లైంగిక వేధింపులు పెరిగి పోతున్నాయి

కంపెనీల్లో మహిళలపై వేధింపులు

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ కంపెనీల్లోనూ మహిళా ఉద్యోగులకు రక్షణ కరువవుతోంది. ఎన్ని చట్టాలున్నా లైంగిక వేధింపులు పెరిగి పోతున్నాయి.  2018-19 ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్‌ కంపెనీల్లో స్త్రీలపై 663 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి సంవత్సరానికి (2019-20) ఇది 678కి చేరింది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు సంబంధించి తాజాగా విడుదలైన ఎక్స్‌లెన్స్‌ ఎనేబలర్స్‌ నివేదిక ఈ విషయం పేర్కొంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 ప్రకారం  లిస్టెడ్‌ కంపెనీలు అన్నీ తమ వార్షిక నివేదికల్లో స్త్రీలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి తెలియజేయాలి. ఈ నివేదికల ఆధారంగా ఈ ఎక్స్‌లెన్స్‌ ఎనేబ్లర్స్‌ నివేదిక రూపొందించారు.

Updated Date - 2021-03-09T07:08:46+05:30 IST