ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలి

ABN , First Publish Date - 2022-08-18T06:02:45+05:30 IST

ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) పేరుతో ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు ఆపాలని ఫ్యాప్టో నేతలు బి.వి.రామారావు, టి.ఎల్‌.నరసింహా రావు డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలి
జగ్గయ్యపేటలో వినతిపత్రం అందజేస్తున్న ఫ్యాప్టో నేతలు

ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన

జగ్గయ్యపేట, ఆగస్టు 17: ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) పేరుతో ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు ఆపాలని ఫ్యాప్టో నేతలు బి.వి.రామారావు, టి.ఎల్‌.నరసింహా రావు డిమాండ్‌ చేశారు.  జగ్గయ్యపేట ఎంఈవోకు నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ  ప్రస్తుతయాప్‌లతోనే పాఠ్యాంశాలు బోధించటం కంటే, ఫొటోలు అప్‌లోడ్‌ చేయటంతోనే సమయం సరిపోతుందన్నారు. ఇప్పుడు  ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌తో హాజరుకు రెండు, మూడు గంటలు పడుతుందన్నారు. యాప్‌వల్ల ఆలస్యమైతే జీతంలో కోత పెడ తామని అధికారులు బెదిరించటం దారుణమన్నారు. నేతలు పులి శ్రీనివాసరావు, జి.ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.


తిరువూరులో..

 ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ తొలగించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. విద్యాశాఖ కార్యాలయం వద్ద  బుధవారం సాంకేతికపరమైన సమస్యతో యాప్‌ పనిచేయకపోవటంతో పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ యాప్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. అనతరం వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. నాయకులు మచ్చా శ్రీనివాసరావు, వంగల శేషగిరి, ఎల్‌.వెంకటేశ్వర్లు, షేక్‌ యాకుబ్‌ఆలీ, ప్రమీల, మాధవి, నాగేశ్వరరావు, బాలరాజు, దుల్‌షికర్‌ఆలీ, శీనయ్య, బాజీ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.


కంచికచర్లలో..

 ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను ఉపాధ్యాయుల ఫోన్‌లో కాకుండా ప్రభుత్వం డివైస్‌ను అందించాలని ఫ్యాప్టో నాయకులు బుధవారం ఎంఈవో కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు వంటి ఫొటో అప్‌లోడ్‌ విషయాలను తప్పించాల న్నారు.  కార్యక్రమంలో నాయకులు విక్టర్‌ నగేష్‌, బిక్ష్మయ్య, పులి శ్రీనివాసరావు, ప్రభు కిషోర్‌, అంజిరెడ్డి, శ్రీను, రవి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T06:02:45+05:30 IST